కేసీఆర్ భిక్షతోనే సీఎంగా రేవంత్!

1
- Advertisement -

రకరకాల సాకుతో రుణమాఫీ చేయకుండా సాకు చూపుతున్నారు..ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ లేదు అన్నారు హరీశ్‌ రావు. విద్యా మైనార్టీ పోలీస్ శాఖ లకు మంత్రులు డిప్యూటీ స్పీకర్ చీప్ విప్ లేరు అన్నారు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన హరీశ్ రావు…కేసీఆర్ భిక్ష తో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు..కేసీఆర్ కి రేవంత్ కి నక్కకి నాగలోకనికి ఉన్న తేడా ఉందన్నారు.మూడు సార్లు రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ఓడి పోయింది అంటే రాహుల్ పని అయిపోయింది అన్నట్లు ఉందన్నారు.

కేసీఆర్ పవర్ ఫుల్ ఫైటర్ ,లీడర్..రేవంత్ చిల్లర మాటలు అపు అన్నారు. నీ పక్కన ఉన్న వాళ్ళు కుర్చీ లాక్కుంటారు..నీ కుర్చీ ని ఎప్పుడూ ఎవరు గుంజుకుంటారో తెలియదు అన్నారు. రేవంత్ 5 ఏండ్లు ఉండాలని కోరుకుంటున్నాం…ఒక మంత్రి గవర్నర్ ని కలిశారు..ఇంకో మంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.

Also Read:Harishrao: రేవంత్ సీఎం కాదు..జోకర్

- Advertisement -