Harish:ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్

10
- Advertisement -

ప్రభుత్వ ఆస్పత్రులను సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆస్పత్రి క్యాంటీన్లకు బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిందని తెలిపారు.

రోగులు, డ్యూటీ డాక్టర్లకు ఆహారం సరఫరా చేస్తున్న డైట్‌ క్యాంటీన్లకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజులుగా బిల్లులు చెల్లించడం లేదన్నారు హరీష్‌. దీంతో డైట్‌ క్యాంటీన్‌ సప్లై చేస్తున్న వారి బకాయిలు రూ.20 కోట్లకు చేరుకుందన్నారు. గాంధీ, ఉస్మానియా, పెట్లబుర్జు, సంగారెడ్డి, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రులకు ఆహారం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారన్నారు హరీష్.

- Advertisement -