Harishrao: బుల్డోజర్ రాజ్ నహీ చలేగా!

13
- Advertisement -

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావును కలిశారు హైడ్రా బాధితులు. ఈ సందర్భంగా తమ గోడును వెల్లబోసుకున్నారు. బాధితులతో మాట్లాడిన హరీశ్‌ రావు…కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతూ ‘బుల్డోజర్ రాజ్ నహి చలేగా’ అంటూ ప్రచారం చేస్తున్నాడు. మరి తెలంగాణలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ రాజ్యం నడిపిస్తోందన్నారు.

ముందు తెలంగాణకు వచ్చి ఈ బుల్డోజర్లు ఆపు. ఆ తరువాత ‘బుల్డోజర్ రాజ్ నహి చలేగా’ అంటూ అక్కడ ప్రచారం చేయి అని ఎద్దేవా చేశారు. మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పి, పేద మరియు మధ్య తరగతి ప్రజల చేత సీఎం రేవంత్ రెడ్డి కన్నీళ్లు పారిస్తున్నారన్నారు.

మా కుటుంబాలను రోడ్డున పడేసి ఏం అభివృద్ధి చేస్తారు అని ప్రశ్నించారు హైడ్రా బాధితులు. రేవంత్ చేస్తున్న విధ్వంసం..ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరంపై ఉన్న నమ్మకం, బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందన్నారు.

Also Read:పురాతన బావులు దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు 

- Advertisement -