కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశామని బీఆర్ఎస్ పార్టీని వీడారో చెప్పాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన హరీష్…పార్టీ మారిన కడియం….ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. కడియం పార్టీని వీడిన తర్వాత ఆయన్ని ఓడించాలన్న కసి కార్యకర్తల్లో కనబడుతుందన్నారు.
పార్టీకి ద్రోహం చేసిన కడియంకి గట్టిగా గుణపాఠం చెప్పాలని.. ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకుని, అందరితో సమావేశాలు పెట్టించి చివరి క్షణంలో పార్టీ మారిన ద్రోహి అని మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, ఎంపీగా అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు హరీష్. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ పార్టీ మారనని చెప్పిన కడియం…ఇప్పుడు ఎందుకు ఇలా చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
సెక్రటేరియట్‌లో లంకె బిందెలు ఉన్నాయనకున్న రేవంత్ మాటలకు కడియం కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ఓ దొంగ అని తీవ్ర విమర్శలు చేసిన కడియం.. ఇవాళ అదే దొంగతో కాంగ్రెస్ కండువా కప్పించుకున్నారన్నారు. చరిత్ర చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో కూడా ఐదేండ్లు కంటే ఎక్కువ లేదన్నారు.
Also Read:KTR:బీఆర్‌ఎస్‌కే ఓటేయండి