KTR:నల్గొండ రైతులతో కేటీఆర్

33
- Advertisement -

కేసీఆర్ ఉన్నన్ని రోజులు నాగార్జునసాగర్ నుంచి మొదలుకొని… టేయిల్ ఎండ్ దాకా ప్రతి ఒక్కరికి సాగునీరు అందిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్గొండ మండలం, ముషంపల్లి గ్రామంలో రైతులు గన్నెబొయిన మల్లయ్యను, బోర్ల రాంరెడ్డిలను కలిశారు కేటీఆర్. తమ పంటలు అన్ని ఎండిపోయి అప్పుల పాలయ్యామని, కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు రైతులు బాగున్నారని, మళ్ళీ కేసీఆరే సీఎం కావాలన్నారు మల్లయ్య. మల్లయ్య వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్.. నల్గొండ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తా అని ట్విట్టర్ లో తెలిపిన కేటీఆర్.. ఇచ్చిన మాట నిలుపుకుంటూ ఇవ్వాళ ముషంపల్లి గ్రామంలో రైతు మల్లయ్యను కలిశారు.

ఆనాటి తెలంగాణ రైతుల దుస్థితికి, అవస్థలకి చిహ్నంగా నిలిచిన బోర్ల రామిరెడ్డిని, ఆయన దీన పరిస్థితిని కేసీఆర్ వందల సార్లు చెప్పారు.. ముషంపల్లికి చెందిన రాంరెడ్డి పేరు బోర్ల రామిరెడ్డిగా మారిందన్నారు. గండేపోయిన మల్లయ్య యాదవ్, బోర్ల రామిరెడ్డి గారి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత మనసున్న ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుందన్నారు. అందుకే మల్లన్నను ప్రత్యేకంగా కలిసేందుకు ఈరోజు ముషంపల్లికి రావడం జరిగింది…రామ్ రెడ్డి అన్నను కలిసినా, మల్లన్నను కలిసినా, కొంతమంది మహిళలను కలిసినా, గత పది సంవత్సరాలలో ఏ రోజు తాగునీటికి, సాగునీటికి కొరత రాలేదని చెప్పారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయినయ్, తాగునీరు దొరకని పరిస్థితి ఉందని తమ దీనావస్థను చెప్పుకుంటున్నారు …ఇది కాలం తెచ్చిన కరువు కాదు, అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ప్రతి ఒక్కరు చెబుతున్నారన్నారు.

ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును విపల ప్రాజెక్టుగా చూపించాలని… రిజర్వాయర్లలో నీళ్ళు నింపకుండా ఈ ప్రభుత్వం నాటకాలు ఆడిందని… కానీ కేసీఆర్ పర్యటన భయంతో నంది పంప్ హౌస్లో ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి కరీంనగర్ కి నీళ్లు వదిలారన్నారు. నిన్నటిదాకా కాలేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పి.. కానీ ఇదే రోజు అదే బాహుబలి మోటార్ల తో కరీంనగర్ కి నీళ్లు అందిస్తున్నారన్నారు. గత పది సంవత్సరాలలో ఏనాడు ఒక బోరు వెయ్యాల్సిన పరిస్థితి రాలేదు…. కానీ గత నాలుగు నెలల్లో ఆరు బోర్లు వేసిన పరిస్థితి ఉందని రాంరెడ్డి చెప్పారన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి సమస్యను పరిష్కరించకుండా ఉత్త మాటలు మాట్లాడుతున్నాడు.. రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రులంతా కూడా రాజకీయ చేరికల పైన దృష్టి పెట్టారు కానీ రైతాంగం సమస్యల పైన కాదు అన్నారు.

Also Read:KTR:బీఆర్‌ఎస్‌కే ఓటేయండి

- Advertisement -