రైతుబంధు ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్!

5
- Advertisement -

మీ అందరిని చూస్తే మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నారు హరీశ్‌ రావు. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రైతు రుణమాఫీ చేసేందుకు ఈ రైతు దీక్షను సునీత లక్ష్మారెడ్డి ఏర్పాటు చేశారు అన్నారు. నెల రోజులు దాటిన రైతుల వడ్లను కొనడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది…పంట చేతికి వచ్చిన రైతుబంధు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను చూపేందుకు ఈ రైతు దీక్ష అన్నారు.

ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎవరు అడగకపోయినా రైతుల కోసం రైతుబంధు పెట్టింది కేసీఆర్…ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చి, రైతులకు ఐదు లక్షల రూపాయల రైతు బీమా అందించిన కేసీఆర్ అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది మన కేసీఆర్. రైతుల పంటను గింజ లేకుండా కొన్నది మన కేసీఆర్ అన్నారు.

రైతులకు నీటి తీరువ లేకుండా చేసింది కేసీఆర్… అందుకే కెసిఆర్ ని రైతుల సీఎం అని కొనియాడారు అన్నారు. బూతుల సీఎంగా చరిత్రలో నిలిచాడు రేవంత్ రెడ్డి. కెసిఆర్ రైతుల సీఎం అయితే రేవంత్ రెడ్డి బూతుల సీఎం అని మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆరు హామీలు అమలు చేశామని చెప్పుకుంటున్నారు అన్నారు.

మహిళలకు 2500 రూపాయలు ఎగపెట్టింది కాంగ్రెస్ పార్టీ…2 లక్షల రుణమాఫీ రైతులకు చేశారా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చారా..4000 పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చారా..ఇన్ని హామీలు ఎగపెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పుకోవడం దుర్మార్గం అన్నారు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసింది రేవంత్ రెడ్డి….ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి రైతులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read:జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండిలా!

- Advertisement -