కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతోంది అని మండిపడ్డారు మండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు పెట్టాక సీఎం రేవంత్ రెడ్డి డిల్లీకి అనేక సార్లు పోయినా దీనిపై మాట్లాడలేదు… రాహుల్ గాంధీ దీనిపై ఎందుకు స్పందించడం లేదు చెప్పాలన్నారు.
కేసీఆర్ ఆదేశాలతో తమిళనాడులో బీసీ చట్ట బద్ధత ఎలా కల్పించారో అక్కడ పర్యటించి తెలుసుకున్నాం…. ఆ విషయాలు ఈ ప్రభుత్వానికి చెప్పినా పెడ చెవిన పెట్టింది అన్నారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం… బీజేపీ ఎంపీలు నోరు విప్పరు. కేవలం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల తరపున పోరాడుతుందని తెలిపారు.
రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్లు అనే పులిపై స్వారీ చేస్తున్నారని చెప్పాం… మాట తప్పితే తీవ్ర పరిణామాలు తప్పవు అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. 42శాతం జీవో ద్వారా ఎన్నికలు నిర్వహిస్తాం అంటున్నారు… మరి 22 నెలలల్లో జీవో ఎందుకు ఇవ్వలేదు చెప్పాలన్నారు. దేశంలో బీసీ రిజర్వేషన్ల సాధించిన రాష్ట్రం తమిళనాడు. మిగతా రాష్ట్రాలు ఎందుకు విఫలం అయ్యాయో అసెంబ్లీలో మేము వివరించాము అని తెలిపారు.
Also Read:ఏపీ సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీసు

