కొండపోచమ్మ సాగర్ కాలువ లీకేజీపై స్పందించారు మంత్రి హరీష్ రావు. గజ్వేల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్… కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్స్, బీజేపీలు గ్లోబల్ ప్రచారం చేశాయని మండిపడ్డారు.చిన్న కాలువ తెగితే పెద్ద రాదత్తం చేస్తున్నారు.. కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. – ప్రంపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ కాళేశ్వరం లిఫ్ట్ అన్నారు. కాంగ్రెస్స్ హయాంలో ప్రాజెక్టులు సైతం కొట్టుకుపోయిన విషయం మరిచిపోయి మాట్లాడం విడ్డురంగా ఉందన్నారు.
ఎస్సారెస్పీ ఓపెన్ చేసినప్పుడు కూడా 131,118 కిలోమీటర్ల వద్ద కాలువ బ్రీచ్ అయ్యిందని… ఖమ్మం జిల్లాలో పాలెం వాగు ప్రాజెక్టు 04, 07,2007న కొట్టుకుపోయిందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రెడీ కాకముందే కొట్టుకుపోయింది దాని నిర్మణంలో లోపం ఉందని అప్పటి కాంగ్రెస్స్ వారు దాన్ని వదిలేశారని తెలిపారు.
దేవాదుల ప్రాజెక్ట్ పైపులు పటాకుల లాగా పేలిపోయాయి… అప్పుడు మంత్రులుగా ఉత్తమ్, పొన్నాల ఉన్నారని గుర్తుచేశారు హరీష్. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కాలువలకు కూడా 200 సార్లు గండి పడిందని…..ఇటీవలే మనోహరబాద్ లో కురిసిన వర్షానికి రైల్వే లైన్ తెగి కొట్టుకొనిపోయిందన్నారు.దీనికి కారణం ప్రధానమంత్రి అని మేము అంటే బీజేపీ నాయకులు ఒప్పుకుంటారా..?ఈని ప్రశ్నించారు.
కాంగ్రెస్స్ హయాంలో నీరు,కరెంట్ ఇవ్వకుండా రైతులను గోస పెట్టారు…అసాధ్యం అనుకున్న గోదావరి నీటిని తెచ్చి రైతులకు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్స్ పార్టీ అంటే గ్లోబల్స్ పార్టీ అని ముద్ర పడింది… దీని వల్లే ప్రతి పక్ష హోదా కూడా కోల్పోయిందన్నారు. కరీంనగర్ లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చెరువులు నింపామని….కొండపోచమ్మ సాగర్ కు వచ్చిన కాంగ్రెస్స్, బీజేపీ వారు.. ఆ నీరు నేతి మీద నీళ్లు పోసుకుని… చేసిన తప్పులను ఒప్పుకొని కొండపోచమ్మకు దండం పెట్టండన్నారు. సలహాలు ఉంటే ఇవ్వండి.. కానీ బురద చల్లి పోవాలని చూస్తే ఒప్పుకొమని స్పష్టం చేసిన హరీష్… రెండు రోజుల్లో పనులు పూర్తి అవుతాయి… యధావిధిగా నీరు వస్తాయన్నారు.