గ్రామ పంచాయతీల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారని…చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతుందన్నారు.
ఈ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదు అన్నారు. ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని… ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు.
ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది అబద్దమా?ఆలోచించాలన్నారు. కేంద్రం నుండి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన రూ. 2100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్ళించింది అబద్దమా? 15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ. 500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్దమా? మాజీ సర్పంచ్‌లు పెండింగ్ బిల్లుల కోసం ఛలో సచివాలయం పిలుపు నిస్తే వారిని పోలీస్ స్టేషన్‌లలో నిర్బంధించింది అబద్దమా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు.
Also Read:కేరళ రాయల్ క్లాన్‌తో పూనమ్ కౌర్