దసరా పండగ వేళ ఆర్టీసీ టికెట్ ధరలను భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ టికెట్ ధరల పెంపుపై మండిపడ్డారు హరీశ్ రావు. ఆర్టీసి టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు.
టికెట్ ధర రూ. 140తో జేబీఎస్ నుండి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ. 200 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. హనుమకొండ నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ. 300 ఉంటే, పండుగ వేళ రూ.420కి ఛార్జీలు పెంచిందని తెలిపారు.
ఆర్టీసి టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం.
టికెట్ ధర రూ. 140తో జేబీఎస్ నుండి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ. 200 చెల్లించాల్సిన పరిస్థితి.… pic.twitter.com/C8NX3EvWXV
— Harish Rao Thanneeru (@BRSHarish) October 14, 2024
Also Read:Pawan:పారదర్శక పాలన అందిస్తున్నాం