రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..?..దోపిడీ దొంగనా..?

1
- Advertisement -

దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య అన్నారు.

ఇంత కంటే దారుణం ఏముంటుంది. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..?..రైతుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు అన్నారు.

వాళ్ళ భూములు గుంజుకుంటారు. తిరగబడితే అరెస్టులు చేస్తారు. వాళ్ళను ఉగ్రవాదులుగా భావిస్తూ అత్యంత క్రూరంగా వ్యవహరిస్తారు…రేవంత్ రెడ్డి.. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం. ఇదేనా మీ ప్రజాపాలన?..ముమ్మాటికి మీది ప్రజా కంటక పాలన. రైతు కంటక పాలన అని మండిపడ్డారు హరీశ్‌.

 

Also Read:2024: టాప్-10 ట్రెండింగ్ టాపిక్స్ ఇవే..!

- Advertisement -