ఎన్నికలలో హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయ్యిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు..వంద రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రజల్ని దారుణంగా మోసం చేసిందన్నారు.మూడు విచారణలు, ఆరు వేధింపులు అన్నట్లు కాంగ్రెస్ పాలన సాగిందని..మొదటి సంతకం రుణమాఫీ అని మాట తప్పారున్నారు. కుర్చీ ఎక్కడం మాత్రం రెండు రోజుల ముందు జరుపుకున్నారు…గ్యారంటీలకు మొదటి క్యాబినెట్ లోనే చట్టబద్ధత తెస్తామని మాట తప్పారు..ప్రజా దర్బార్ అని చేయి ఇచ్చారు అన్నారు.
ప్రగతి భవన్ ను కూల్చుతాం నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు…ఈరోజు ఉప ముఖ్యమంత్రి అందులో ఉంటున్నారు….అసెంబ్లీ స్వరూపాన్ని మార్చేస్తా అన్నారు. ఇప్పటివరకు తట్టడం మట్టి కూడా తవ్వలేదు అన్నారు. రైతు భరోసా అన్నారు. మేమిచ్చే రైతు బందును ఇప్పటివరకు పూర్తి చేయలేదు…రుణమాఫీ పై అతిగతి లేదు ఒక్క అడుగు ముందుకు పడలేదు అన్నారు. ఆసరా పింఛన్లు పెంచుతామన్నారు ఉన్న పింఛన్లు సరిగా ఇవ్వడం లేదు…కెసిఆర్ తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే, రేవంత్ రెడ్డి గారు కరువు పెంచేందుకు పోటీపడుతున్నారు అన్నారు.
దేశమంతా కరువు ఉందని మాటలు చెబుతూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు…కెసిఆర్ పాలనలో పచ్చడి పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో పంటలకు మంటలు పెట్టే పరిస్థితి వచ్చింది…కెసిఆర్ గారు వ్యవసాయాన్ని శిఖరాగ్రం లో నిలబెడితే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థకు చేర్చుకున్నారు అన్నారు.కెసిఆర్ గారి హయాంలో తాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే, రేవంత్ రెడ్డి పాలనలో కన్నీళ్ళకు కొరత లేని పరిస్థితి…మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు మేము తెస్తే రేవంత్ రెడ్డి పాలనలో ఖాళీ బిందెల ప్రదర్శన కనిపిస్తుందన్నారు. ఆయన నియోజకవర్గం కొడంగల్ లోనే కనిపిస్తుంది…ఖమ్మం పట్టణంలో ప్రతి మూడు రోజులకు ఒకసారి నల్ల వస్తున్నదట…కర్ణాటక నుండి తాగునీరు తేవడంలో పూర్తిగా వైఫల్యం పొందారు అన్నారు.కృష్ణ బోర్డుకు ప్రాజెక్టులు వచ్చి రాగానే అప్పజెప్పే ప్రయత్నం చేశారు….టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే మళ్లీ తోక ముడిచి అసెంబ్లీలో చేయబోమని ప్రకటన చేశారు అన్నారు.
వంద రోజుల్లో గొల్ల కురుమలకు గొర్రెలు ఇస్తామని మాట చెప్పారు. ఒక్కరికి ఇప్పటివరకు ఇవ్వలేదు..కేసిఆర్ గారు కిట్లు ఇస్తే రేవంత్ రెడ్డి గారు తిట్లతో రాష్ట్రాన్ని కలుషితం చేస్తున్నారు…వంద రోజుల్లో మీరు సాధించింది ఏమైనా ఉందా అంటే పదిసార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు…తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు.రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టాలంటారు…కెసిఆర్ గారు అనారోగ్యంపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు అన్నారు.
Also Read:బ్రహ్మోత్సవాలు..సీఎ రేవంత్‌కు ఆహ్వానం