రేవంత్..అబద్దాల కోరు: హరీశ్‌ రావు

3
- Advertisement -

రేవంత్ రెడ్డి అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి అబద్ధాలతోనే పరిపాలన చేస్తున్నాడని మండిపడ్డారు. మూసీ కంపుకంటే ఈ ముఖ్యమంత్రి చెప్పే కంపే ఎక్కువ…ఏడాదిగా చేసిందేమీ లేదు, అబద్ధాల పాలన సాగిస్తున్నరు అన్నారు. ఇక ఆ దేవుడే ఈ రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలె, రైతు భరోసా ఎప్పుడిస్తారో, ఎంతిస్తారో చెప్పలేదు అన్నారు. రుణమాఫీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు, అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతారు..ఈ సమావేశాల్లో ప్రభుత్వం తేలిపోయిందన్నారు.

ముఖ్యమంత్రి కడుపులున్నది అంతా కక్కిండు, ఒక్క స్కూలు కట్టిన్రా అని సీఎం మాట్లాడిండు అన్నారు. నీకేం తెలుసు, ఏ నియోజకవర్గానికి పోదాం పద, చూపెడతం..మేం ఫార్మా సిటీలో ఏ కంపెనీకైనా ఒక్క ఎకరం ఇవ్వలేదు, కానీ అగ్గువకు కంపెనీలకు కేటాయించినట్లు అబద్ధాలు చెప్తున్నాడన్నారు. ప్రతి సబ్జెక్టులో అబద్ధాలే.. నోటికొచ్చినట్లు, సొల్లు వాగుడు…సిగ్గులేదు, మేం రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తే వద్దంటున్నమట అన్నారు. ఆర్ఆర్ఆర్ వద్దంటున్నమట, ప్రాజెక్టులు వద్దన్నమట….అసెంబ్లీ సాక్షిగా ఇన్ని పచ్చి అబద్దాలాడిన ముఖ్యమంత్రిని మేం చూడలేదు అన్నారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే, నేను రాజీనామా చేస్తా అని బల్లగుద్ధి ఛాలెంజ్ చేసిన…. కానీ నువ్వేం చేసినం, ఎగబెట్టినవు, మోసం చేసినవు అన్నారు.

గోబెల్స్ ఉండి ఉంటే ఉరిబెట్టుకొనేటోడు, రేవంత్ అబద్ధాలు చూసి…రుణమాఫీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నరు అన్నారు. రూ. 7500 కోట్లు వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టినవు…రూ. 2500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంటు అన్నారు. రూ. 2000 కోట్లు ముసలోళ్ల ఫించన్లు ఎగ్గొట్టినవు,రూ. 1000 కోట్ల బతుకమ్మ చీరెలు ఎగ్గొట్టినవు… ఇవన్నీ ఎగ్గొట్టినవు, అటు ఇచ్చిన అంటున్నవు, నువ్ చేసిందేన్నారు.

Also Read:పెదవులు పగిలితే.. ఇలా చేయండి!

- Advertisement -