ఖమ్మం సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది అని..బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదు.. మాది పేద ప్రజలకు ఏ టీం ..ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం …బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు …అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందన్నారు.
ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన హరీశ్ రావు…
రాహుల్ గాంధీ గారు..
దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది
అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది
అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారింది
అందుకే దేశ ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టింది
బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదు..
మాది పేద ప్రజలకు ఏ టీం
ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం
బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు
అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టింది
Also Read:అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్:కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా..?
మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరెచ్చేదేంది?
అప్డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిన విషయం తెలియదా?
స్కీమ్ ల్లోని స్కాం ల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించడమే
అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడుగుతే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు..
Also Read:“బండి”కి బీజేపీ స్ట్రోక్..?
ఖమ్మం సభ ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్..
రాహుల్ గాంధీ గారు..
దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది
అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది
అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారింది
అందుకే దేశ ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టిందిబీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదు..
మాది పేద ప్రజలకు ఏ టీం
ప్రజల…— Harish Rao Thanneeru (@BRSHarish) July 2, 2023