ప్రజా పాలన అన్న రేవంత్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే ప్రజలను కలిశారు, రెండవ రోజు మంత్రులు కలిశారు, మూడవ రోజు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టారన్నారు హరీష్ రావు. హైదరాబాద్‌లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన హరీష్..రేవంత్ రెడ్డి సోషల్ మీడియాను ఉపయోగించి ప్రతిపక్ష నేతల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. పార్టీలు మారితే రాళ్ళతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఎడాపెడా కండువాలు కప్పి ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారన్నారు. మ్యానిఫెస్టోలో పార్టీ ఫిరాయింపుల అంశం పెట్టి పార్టీ మారిన వారిని అదే వేదికపై కూర్చోబెట్టారన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయమని ప్రజలు అంటున్నారన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్లపై ప్రమాణాలు చేసి రేవంత్ రెడ్డి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి,మంత్రుల భాష పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు.
రాష్ట్రంలో 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే విధంగా బీజేపీ సహకరిస్తుంది,మరో 8 స్థానాల్లో బీజేపీ గెలిచే విధంగా కాంగ్రెస్ సహకారం అందిస్తుంది,జూన్ తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పిరియడ్ ముగుస్తుంది,బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటేనే పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపిస్తాం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఏడు
మండలాలను ఆంధ్రాలో బీజేపీ కలిపితే కాంగ్రెస్ సహకరించిందన్నారు. అదానీని నెంబర్ 1 చేయడమే బీజేపీ లక్ష్యంగా మారింది,జీఎస్టీ ద్వారా నిత్యావసరాల ధరలు పెరిగాయి,తెలంగాణ ప్రయోజనాలను బీజేపీ దెబ్బతీసిందన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని బీజేపీ నేతలు చెప్తున్నారు, బీజేపీతో ఒకే అంటే జోడీ నో అంటే ఈడీ వస్తోందన్నారు.
రైతు బంధు అడిగితే రాష్ట్ర మంత్రి చెప్పుతో కొట్టాలని అన్నారు,నాకు రైతు బంధు అందలేదని వ్యవసాయ శాఖా మంత్రి చెప్పారు,సీతక్కను రైతు బంధు గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారు,ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న శ్రద్ద ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీకి లేదు అని విమర్శించారు.
Also Read:BJP:కొండాకు కొత్త భయం!