Harishrao:ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే

32
- Advertisement -

మూడోసారి అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీనేని ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు జిల్లాకి ఒక మెడికల్ కాలేజీతో పాటు ఒక నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.

ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పట్టు బట్టి ఈ కాలేజీ సాధించారు…. రూ.25 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ కాలేజీని ఏడాదిలోగా పూర్తి చేస్తాం అన్నారు. గత పాలకులు వైద్య, అనుబంధ కోర్సులను నిర్లక్ష్యం చేశారు….అందుకే కేరళ నుండి నర్సులు వచ్చేవారన్నారు. సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మీ ఎమ్మెల్యే, మంత్రి కోరిక మేరకు ఖమ్మం జిల్లాకు బీఎస్సీ పారామెడికల్ కాలేజీ కూడా త్వరలోనే మంజూరు చేస్తాం అన్నారు.

సీతారామ ప్రాజెక్ట్ ఎంతో ముఖ్యమైనది. ఇది పూర్తి అయితే కృష్ణా నదితో సంబంధం లేకుండా రెండు పంటలు పండుతాయన్నారు. కాంగ్రెస్ వాళ్లది మేక పోతు గాంభీర్యం. ఖమ్మంలో ఒక్క సీటు రానివ్వం అని కాంగ్రెస్ నాయకులు అంటున్నరు. ఖమ్మం మీ తాత జాగీరా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేసేది బిఆర్ఎస్ మాత్రమేనన్నారు.

Also Read:డబ్బింగ్‌లో కార్తి..’జపాన్’

- Advertisement -