- Advertisement -
వరద నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే హవేళిఘనపూర్ లో ఇద్దరు చనిపోయారు అన్నారు.
ఎవరైనా సహాయం చేస్తారని ఇద్దరు వ్యక్తులు గంటల కొద్దీ స్తంభాన్ని పట్టుకొని అలానే ఉండిపోయారు… సకాలంలో సాయం అందక ప్రజలు చనిపోతున్నారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలి అన్నారు.
సిద్ధిపేట జిల్లా పోతారెడ్డిపేటలో వాగులో చిక్కుకున్న రైతులను కాపాడింది రెస్య్కూ సిబ్బంది. నిన్న పొలానికి వెళ్లి వాగులో చిక్కుకున్నారు ముగ్గురు రైతులు. రాత్రంతా వాగులోనే ఉన్నారు ముగ్గురు రైతులు.వీరిని రెస్య్కూ సిబ్బంది కాపాడారు.
Also Read:విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్
- Advertisement -

