Harishrao:ఎన్నడూ లేని విధంగా దశాబ్ది ఉత్సవాలు

48
- Advertisement -

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర అధ్యక్షతన జరిగిన తెలగాణ కేబినెట్‌ సమావేశంలో కీలక ఆంశాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో అనేక కీలకమైన ఆంశాలపై సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. అలాగే మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. దాదాపు మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

సీఎం కేసీఆర ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 21రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో సంబురాలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో వెనుకబడ్డ కులాల ఆర్థిక స్వావలంభన కోసం మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ వేయాలని నిర్ణయించామని అన్నారు. అలాగే జీవో111నూ పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. దీని ద్వారా 84గ్రామాల ద్వారా వచ్చిన వినతి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. హిమాయత్ సాగర్ గండిపేట జలాశయాలు కాపాడేందుకు పక్బందీగా చర్యలు తీసుకుంటామని అన్నారు. వీటిని కాళేశ్వరం జలాలతో పూర్తిగా నింపనున్నట్టు వెల్లడించారు.

వ్యవసాయ రంగంలో కీలకమైన మార్పులు తీసుకువస్తున్నామని అన్నారు. ఇందుకోసం మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వడగళ్ల వానకు నష్టపోయిన రైతులను సత్వరమే ఆదుకుంటామని అన్నారు. అందులో భాగంగా పంటకాలంను నెల ముందుకి జరపాలని ప్రణాళిక చేస్తున్నట్టు తెలిపారు.

Also Read: CM KCR:మళ్లీ అధికారం మనదే

నకిలీ విత్తనాల విషయంలో దేశంలో ఏరాష్ట్రం చేయని విధంగా పీడీ యాక్ట్‌లను పెట్టామని తెలిపారు. అలాగే డీజీపీ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలను పూర్తిస్థాయిలో అరికడతామని అన్నారు. రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ మరో 15రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మక్కలు జొన్నలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం తరపున గ్యారెంటీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.

Also Read: కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ

- Advertisement -