ప్రణబ్‌ మృతి తెలంగాణకు తీరని లోటు: హరీష్ రావు

184
harishrao
- Advertisement -

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి ,తెలంగాణ రాష్ట్రం కు తీరని లోటు అన్నారు మంత్రి హరీష్ రావు.రాష్ట్రపతిగా తెలంగాణ గెజిట్ పై సంతకం పెట్టారు.తెలంగాణ రాష్ట్రం,టీఆరెస్ పార్టీ, సీఎం కేసీఆర్ కు ప్రణబ్ ముఖర్జీ తో ఎంతో అనుబంధం ఉంది.సీఎం కేసీఆర్ తో 2004 హిమాచల్ ప్రదేశ్ లో తొలిసారి ప్రణబ్ ముఖర్జీ కలిశాను.

ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం లో కలవాలని సీఎం కేసీఆర్ పిలుపు వచ్చి నేపథ్యంలో 2004 లో యూపీఏ చేరేందుకు సీఎం కేసీఆర్ తో నేను కూడా ప్రణబ్ ముఖర్జీ కలవడానికి వెళ్ళాను ఆరోజు అన్నారు యూపీఏ ప్రభుత్వం వస్తే మీరు ఇంట్లో కూర్చుండి తెలంగాణ తీసుకోవచ్చు అన్నారు అన్నట్టే ఆయన రాష్ట్రపతి అయ్యాక సంతకం పెట్టారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రం అవసరం కోసం,1969 ఉద్యమం గురించి మన ముఖ్యమంత్రి ప్రణబ్ కు వివరించారు.ప్రణబ్ ముఖర్జీ ఆయన రాసిన పుస్తకం లో కూడా తెలంగాణ గురించి రాశారు.సీఎం కేసీఆర్ ను ఎన్నో సార్లు కొనియాడారు ప్రణబ్ ముఖర్జీ ,ఉద్యమం చేసిన వ్యక్తివి నేడు సీఎం కావడం అరుదుగా వస్తుంది అవకాశం అని అన్నారు.ఇలాంటి గొప్ప అరుదైన అవకాశం మీకు రావడం చాలా సంతోషము అన్నారు.

రాజకీయంలో ఎంతో అపార అనుభవం ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ.ఎంతో క్లిష్ట సమయంలో పార్టీకి ప్రభుత్వం కు అండగా ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతున్న,ఆయన కుటుంబం కు నా ప్రగాఢ సానుభూతి తెలువుతున్నానని చెప్పారు హరీష్ రావు.

- Advertisement -