అ’శోక నగరాన్ని సందర్శించండి రాహుల్ గాంధీ గారు అని ఎక్స్ వేదికగా తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే, మీ సో-కాల్డ్ ప్రజా పాలన విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది. లాఠీ చార్జ్ చేసి వీపులు పగలగొట్టింది. ఈ దారుణాలు మీకు తెలుసా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ని సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి, వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడండన్నారు. మీరు వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10% ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు అన్నారు.
టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు, ప్రక్షాళన సంగతి దేవుడెరుగు, టీఎస్పీఎస్సీని టీజీపీఎస్‌గా పేరు మార్చి చేతులు దులుపుకున్నారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు, కానీ అది కేవలం జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయిందన్నారు.
పది నెలల కాలంలో నిరుద్యోగ భృతి, 5 లక్షల రూపాయల యువ వికాసం పథకం వంటి హామీల ఊసు కూడా లేదు. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు మీ పార్టీ చూపిన కపట ప్రేమ బట్టబయలైందని…కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తుపెట్టుకుంటుందన్నారు.
Telangana’s youth have been misled by @RahulGandhi ji and his party.
Rahul Gandhi ji, are you aware students were beaten by your ‘Prajala Sarkar’ at the very place you visited?
Less than 10% of the promised 2 lakh jobs have been delivered, and the so-called ‘revamped TSPSC’ is… https://t.co/2LSdJ4gBTr pic.twitter.com/qogwk9oh6l
— Harish Rao Thanneeru (@BRSHarish) November 5, 2024
Also Read:KTR:ప్రజలను బాధించడం సరికాదు