దేవుడు వరమిచ్చినా..పూజారి వరమివ్వలేదు!

9
- Advertisement -

దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా ఉంది ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ, 199 జెటివోలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీష్ రావు… కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురాన్ని లేకుండా చేస్తున్నది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

పది రోజుల్లో ఐదు సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి, వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయం అన్నారు. కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగి పోవడం విద్యార్థుల వంతు అవుతున్నది…పెళ్ళి పేరు చెప్పి, పదో తరగతి ఫలితాలు వాయిదా వేయడం,
పూటకో కారణం చెబుతూ, నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ @TelanganaCMO ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అలవాటుగా మారింది అన్నారు.

ప్రచార ఆర్భాటం పక్కన బెట్టి, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియమక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. @BRSparty ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లో ప్రతిభ చాటి, ఏఈ, జెటివో లుగా నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు అన్నారు.

 

Also Read:Odela 2:ఓటీటీలోకి ఓదెల 2!

- Advertisement -