టీచర్లు లేక ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్.. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది.. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తరగతి గదుల్లో చదువుకు నోచుకోని పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజనులు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని తెలిపారు. కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించింది ఉన్న స్కూళ్లను మూత వేయడానికా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మూతపడ్డ 43 ప్రభుత్వ పాఠశాలలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. టీచర్ల నియామకం జరిగేవరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
Also Read:KTR: ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు?
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తరగతి గదుల్లో చదువుకు నోచుకోని పరిస్థితి వచ్చింది.
ఒకటి కాదు రెండు కాదు 43 పాఠశాలలు ..
అదీ గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక మూతపడటమంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలి.ప్రభుత్వ… pic.twitter.com/fiju7lqecE
— Harish Rao Thanneeru (@BRSHarish) August 27, 2024