Harishrao: రాష్ట్రంలో బాలికలకు భద్రత ఏది?

5
- Advertisement -

రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు భద్రత కరువైందన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. భద్రత కల్పించవలసిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని…ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు.

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదు అని మండిపడ్డారు హరీశ్‌. ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలి. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:తిరుపతి లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు

- Advertisement -