Harishrao: శానిటేషన్ సిబ్బంది జీతాలేవి?

5
- Advertisement -

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఆరు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషమని అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం ఆసుపత్రి సిబ్బందికి శాపంగా మారిందని హరీశ్‌రావు అన్నారు.

ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రికి వీరి వెతలు కనిపించడం లేదన్నారు. జీతాలు చెల్లించాలని కోరుతూ సిబ్బంది ఎన్నిసార్లు నిరసనలు తెలియజేసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా ఉండటం లేదని అన్నారు.

విషజ్వరాలు విజృంభించి రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్న సమయంలో, ఆసుపత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి, టీవీవీపీ ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

Also Read:సర్వైవర్ సినిమాకు అవార్డుల పంట

- Advertisement -