Harish:టీచర్స్‌ డే..మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా!

6
- Advertisement -

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి గారు అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్‌..సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6200 మంది పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు (DEOs) ను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్య. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

మూడు నెలలుగా జీతాలు చెల్లించరు, అడిగినందుకు ఉద్యోగాల నుండి తొలగిస్తారు. ఇదేనా మీ ప్రజా పాలన? ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? అని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించి వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బతుకులను ఆగం చేశారు అన్నారు.

మరోవైపు మీ నిర్లక్ష్య, అర్థం లేని నిర్ణయం వల్ల వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని..తొలగించిన పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లు, డీఈవోలను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మూడు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read:Telugu states rains: ప్రభాస్ రూ.5 కోట్ల విరాళం

- Advertisement -