Harish:వైద్య విద్యార్థులపై దృష్టి సారించండి

23
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100% తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.జూన్ మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణం స్పందించి స్పష్టత ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలి. లేదంటే వైద్య విద్య చదివే అవకాశాలను తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా కోల్పోతారన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందున్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,900 సీట్లు ఉన్నాయి. ఇందులో 15శాతం అన్ రిజర్వుడు కోటా అంటే 280 సీట్లు తెలంగాణ విద్యార్థులు నష్టపోతారు. దీంతోపాటు నిమ్స్ సహా ఇతర మెడికల్ కాలేజీల్లోని దాదాపు 150 పీజీ సీట్లు కోల్పోతారు…ఎంబీబీఎస్/పీజీ అడ్మిషన్ల ప్రక్రియ సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమైన విషయాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం దురదృష్టకరం అన్నారు.

తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నది. ప్రభుత్వ తీరుతో తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 2014 నుండి కన్వీనర్ కోటాలో 15% సీట్లకు తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సైతం పోటీపడే వెసులుబాటు కల్పించారన్నారు.ఇదే విధానం కొనసాగితే, 2014 తర్వాత ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లో కూడా 15శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల దాదాపు 520 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుందన్నారు.

దీన్ని నివారించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేసింది..దీనికోసం, AP రీఆర్గనైజషన్ ఆక్ట్ మరియు ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి తెలంగాణ స్టేట్ మెడికల్/డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.దీని ప్రకారం, 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభించాయన్నారు.

Also Read:గాడ్ ఫాదర్‌..కాంబో రీపిట్!

- Advertisement -