పేదల పక్షపాతి రామలింగారెడ్డి: హరీష్ రావు

245
harishrao
- Advertisement -

రామలింగరెడ్డి పేదల పక్షపాతి అన్నారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా ZP సమావేశం లో దుబ్బాక MLA సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించిన సభ జరుగగా… రామలింగారెడ్డి లేకుండా ఈ సమావేశం జరగడం ఊహించుకోలేదు ..1999 నుండి సుమారు 21 ఏండ్ల నుండి ఆయనతో సాన్నిహిత్యం ఉండేదన్నారు.

ఆయన ఎవరితో నైనా ఏదైనా విషయం చెప్పాల్సి వస్తే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవాడు..రామలింగారెడ్డి జర్నలిస్టుగా పేద ప్రజల పక్షాన, అన్యాయం పక్షాన గొంతుకల ఉండేవాడన్నారు. ఆయన వార్తలు రాయడమే కాకుండా వాటి పరిష్కారం దిశగా పని చేసేవాడన్నారు.

4 సార్లు ఎమ్మెల్యే గా రెండు సార్లు అంచనాల కమిటీ చైర్మన్ గా పనిచేశారు….ఆయన జీవితం అత్యంత నిరాడంబర జీవితం..నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఇప్పటికే హైదరాబాదులో ఇల్లు లేదు హైదరాబాద్ వస్తె ఎమ్మెల్యే క్వాటర్ లోనే ఉండేవాడన్నారు.ఆయన నిరంతరం ప్రజలతో మమేకమయ్యే మంచి నాయకుడు…ఆయన ఆరోగ్యం దెబ్బతిన్న కార్యకర్తలు కాపాడుకోవాలని ప్రాణాలు పోగొట్టుకున్నాడు…డాక్టర్ చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశాడు ఆయనను బ్రతికించేందుకు…ఆయనతో అనేక ఉప ఎన్నికల్లో అరెస్ట్ లలో, ఉద్యమం లో కలిసి పని చేశామని తెలిపారు.

ఆత్మీయున్ని కోల్పోవడం మాటల్లో చెప్పలేను…రామలింగారెడ్డి కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు ఆయనను లింగం అని పిలుచుకునేవారు కేసీఆర్
…ఆ రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జర్నలిస్ట్ అధ్యక్షుడిగా ఉండి బస్ పాస్ లు ఇప్పించాడు…టాడా చట్టం ప్రయోగించిన తొలి జర్నలిస్టు రామలింగారెడ్డి
అన్నారు. ఆయనను జైలు నుంచి బయటకు తీసుకోవడానికి ఉద్యమాలు జరిగాయి…ఆయన మరణం దుబ్బాక కు సిద్దిపేట జిల్లా కు తీరని లోటు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.

- Advertisement -