మాస్క్ లేకుండా బయటకు రావొద్దు: హరీష్ రావు

103
harishrao

సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్ పల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్ టి పిసి ఆర్ ల్యాబ్ ను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు.అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, కళాశాల ప్రిన్సిపాల్ తమిళ అరసు పాల్గొన్నారు.

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుంది…కరోనా ను ఇబ్బందిగా తీసుకోవాల్సిన అవసరం లేదు దైర్యంగా ఎదుర్కోవాలి….మాస్క్ లేకుండా బయటకు రావద్దు, వస్తే వెయ్యి రూపాయల పైన్ వేసే చట్టాన్ని కేంద్రం తీసుకు వచ్చింది…ప్రతిరోజూ ఆవిరి పడుతూ వేడినీరు త్రాగాలన్నారు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల కేసులు పెరుగుతున్నాయి …హైదరాబాద్ లో కేసులు తగ్గుముఖం పట్టి జిల్లాలలో పెరుగుతున్నాయన్నారు.

వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఆశావర్కర్లు,rp లు,anm లు తొందరగా పరీక్షలు జరిపించాలి….కరోనా చైనాలో పుట్టి మన దేశానికి వచ్చింది
…జిల్లాలో 40 ర్యాపిడ్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. సిద్దిపేట పట్టణంలో మూడుచోట్ల పరీక్షలు చేస్తున్నాం….పాజిటివ్ వచ్చిన వారిని ఐసిలేషన్ కి పంపించాలిన్నారు.

ప్రతి రోజు కౌన్సిలర్స్, ఆశ వర్కర్స్,anm లు సుమారు 50 మంది సమాచారం పోన్ ద్వారా తెలుసుకోవాలి…రాష్ట్రానికి లక్షలాది ర్యాపిడ్ కీట్స్ తెప్పించాం…కరోనా కోసం ప్రభుత్వం ఎంతైనా డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఈ చివరి దశలో ఆసుపత్రికి వచ్చేవారు చనిపోతున్నారు కావున మొదటి దశలోనే ఆసుపత్రికి రావాలన్నారు.

పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐసొలేశన్ కీట్స్ ఇస్తున్నాం…26 వేల రూపాయల విలువ గల రేమిదిస్పిర్ ఇంజెక్షన్లు ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది…ఇంతకుముదు పరీక్షల కోసం హైదరాబాద్ కి వెళ్లి పరీక్షలు చేసుకొనేవారు…నేడు ప్రజల దగ్గరకు వెళ్లి పరీక్షలు నిర్వహించే వాహనాన్ని ప్రారంభం చేసుకున్నాం అన్నారు.

నేడు మెడికల్ కాలేజీలో ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ప్రారంభించాం…దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి….రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాకు మొదటి ఆర్టీపీస్అర్ ఇదన్నారు. లక్షణాలు ఉన్నవారు దైర్యంగ ముందుకు వచ్చి పరీక్షలు చేసుకోవాలి …ప్రజాప్రతినిధులు కష్టకాలంలో ఉన్న ప్రజలకు దైర్యం కల్పించాలన్నారు. ప్లాస్మా దానం చేసేందుకు పాజిటివ్ వచ్చిన వారు ముందుకు రావాలి….ప్లాస్మా థెరపీ ద్వారా పాజిటివ్ వచ్చిన వారు బాగుపడూతారు…ప్లాస్మా దానం కు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రాణాలు కాపాడాలన్నారు.