సీఎం కేసీఆర్ వల్ల నల్లగొండ నీళ్ళ కుండ అయ్యిందన్నారు మంత్రి హరీష్ రావు. సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్…కేసీఅర్ సల్లగా ఉండాలని మీరు దీవించారు…హేమాహేమీలు అని చెప్పుకునే వారిని మట్టికరిపించి, 12 కు 12 స్థానాలు గెలిచాం అన్నారు. తుంగతుర్తిలో లక్ష ఎకరాలకు నీళ్ళు పారుతున్నాయి…నాలుగు ఏళ్ళల్లో ఏనాడైనా కరువు చూసామా అన్నారు. కాళేశ్వరం తో రెండు పంటలకు నీళ్ళు అందిస్తున్నది కేసీఆర్ అన్నారు.
కూలీ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూలీలు దొరకని పరిస్థితి ఉందన్నారు. ఏపీ నుండి చత్తీస్గడ్ నుండి ఇక్కడికి కూలీలు వలస వస్తున్నారని తెలిపారు హరీష్. బీడు వడ్డ భూములు పచ్చటి మాగనిగా మారాయని…50 ఏళ్లలో ఎందుకు నీళ్ళు పారలేదన్నారు. రబ్బరు బుల్లెట్లు, పోలీసు తూటాలకు భయడలేదని…ఉద్యమంలో కిషోర్ ఎంతో చేశారన్నారు. శ్రీకాంత్ చారి అడుగులో అడుగు వేసి పోరాటం చేశారు…కిషోర్ ఎమ్మెల్యే కావడం మీ అదృష్టం అన్నారు. సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని పని చేసే వ్యక్తి అని కొనియాడారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరెంట్ కోతలు, గుజరాత్ లో పవర్ హాలిడేలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయన్నారు. కిలోమీటర్లు నీళ్ళు గుంజినా అడిగే వాళ్ళు లేరన్నారు.
Also Read:కరీంనగర్ సీటు.. కాంగ్రెస్,బీజేపీలో తలపోటు!