హరితవనంగా మెదక్‌: మంత్రి హరీశ్ రావు

230
harishrao
- Advertisement -

ఆరో విడత హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మంత్రి హరీశ్ రావు. మెదక్ జిల్లా పటాన్ చెరు శివారు ఈద్గాలో ప్రార్ధనలు చేసిన అనంతరం మాట్లాడిన హరీశ్‌…ఉమ్మడి మెదక్ జిల్లాను హరిత వనంగా మార్చాలని పిలుపు నిచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి మొక్కలు నాటారు.పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఊరూరా విరివిగా మొక్కలు నాటాలని….భవిష్యత్ తరాలకు మనమే పచ్చదనాన్ని అందించాలని సూచించారు.

సంగారెడ్డి జిల్లాలో 116 రైతు వేదికలు ఉన్నాయి. ఇందులో తొలి రైతు వేదికకు పెద కంజర్లలో శంకుస్థాపన చేసుకున్నాం.8 రైతు వేదికలు నెల 15 రోజుల్లో పూర్తి చేసి యాసంగి పంటకు రైతుల సమావేశాలు జరగాలన్నారు.ఏ ప్రభుత్వం వచ్చినా రైతును రాజు చేస్తామని మాటలు మాత్రమే చెప్తారు. కాని అది చేతల్లో చేసి చూపిన సీఎం కేసీఆర్ అన్నారు.

ఇది నేను చెపుతున్న మాట కాదు. ప్రతీ గ్రామంలో ఏ రైతు అయినా మాట చెప్తారు..కరోనా వల్ల ప్రతీ ఒక్కరు ఇబ్బందిప డ్డారు. చేతివృత్తులు, పరిశ్రమలు, అందరూ ఎఫెక్ట్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గాయి.కాని 22 వేల మంది రైతులకు 6 వేల 888 కోట్ల 43 లక్ష రూపాయలను బ్యాంకుల్లో మూడు రోజుల్లో జమ చేశాం అన్నారు.

ప్రతీ ఎకరానికి 5 వేల పెట్టుబడి సాయం ఇచ్చాం.ప్రతీ రైతు మిస్ అవకుండా మూడు రోజుల్లో రైతు బంధును కరోనా కష్టకాలంలో ఇచ్చాం.కరోనా వల్ల ప్రపంచంలోను దేశంలోను, రాష్ట్రాలలోను ఆదాయం తగ్గిందన్నారు. 3-4 నెలల్లో మనకు రావాల్సిన 16 వేల కోట్ల ఆదాయం తగ్గింది. మనకు రావాల్సిన రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్టీ, వ్యాట్, ఆర్టీఏ రూపాలో రావాల్సిన ట్యాక్స్, కేంద్రం నుంచిరావాల్సిన నిధులు తగ్గాయన్నారు.రైతుకు ఇబ్బంది కలగవద్దని సీఎం గారు ఆలోచించి మూడు రోజుల్లో 6 వేల 888 కోట్ల 43 లక్షల రూపాయలు జమ చేయాలన్నారు. కోటీ 33 లక్షల 77 వేల ఎకరాలకు రైతు బంధు సాయం అందించామన్నారు.

- Advertisement -