- Advertisement -
భారత్ – పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు.
జవాన్ మురళి నాయక్ చేసిన పోరాటం, చూపిన సాహసం వృథా కాదు, భారతదేశం ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుందని చెప్పారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి, జవాన్ల కుటుంబాలకు అండగా నిలబడాలన్నారు హరీష్.
ఇక సిద్దిపేట పట్టణం రంగాధంపల్లి హనుమాన్ దేవాలయం స్వామి వారిని దర్శించుకొని నూతనంగా నిర్మించిన అన్నదాన భవనాన్ని ప్రారంభించారు హరీష్ రావు. హనుమాన్ మాలధారణ స్వాములతో కలసి బిక్ష చేయడం జరిగిందన్నారు.
Also Read:బీజేపీపై ప్రకాశ్ రాజ్ ఫైర్
- Advertisement -
