బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నటుడు ప్రకాశ్ రాజ్. ఒకవైపు శత్రుదేశం పాకిస్థాన్‌తో భారత్ వీరోచితంగా పోరాడుతుంటే మరోవైపు బీజేపీ సోషల్ మీడియా వేదికగా తన నీచబుద్ది చూపిస్తుందని మండిపడ్డారు.
భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ శాంతి చర్చలంటూ సమయం గడపదంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది బీజేపీకి చెందిన అధికారిక సోషల్ మీడియా.
దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్…ఇలాంటి సంక్షోభ సమయంలో సైన్యం యుద్ధం చేస్తుంది.. సరిహద్దుల్లో పౌరులు రక్తమోడుతున్నారు. దేశం ఐక్యంగా పోరాడుతుంది. కానీ కొందరూ మతోన్మాద మూర్ఖులు మాత్రం అత్యంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. భారతీయ మతోన్మాద పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. ఇలా చేస్తుంటే మీకు సిగ్గనిపించట్లేదా అని దుయ్యబట్టారు.
Also Read:కింగ్డమ్..లేటెస్ట్ అప్‌డేట్!

