Harish Rao: తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ

3
- Advertisement -

చాకలి ఐలమ్మ వర్దంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్‌..నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి అని చెప్పారు.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు హరీశ్. కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి అమలు చేసిందని..భావితరాలకు ఆ మహనీయురాలి చరిత్ర తెలువాలని పాఠ్యాంశంగా పెట్టి గౌరవించిందని గుర్తు చేశారు.

 

- Advertisement -