వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి అన్నారు. మెదక్‌లో మాట్లాడిన హరీష్.. వారం రోజులుగా రోజూ కోడెలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోగా కనీస స్పందన కూడా లేదు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డిపెట్టే పరిస్థితి కూడా లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? చెప్పాలన్నారు. కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్టు? చెప్పాలన్నారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితే ఇలా ఉంటే ఎలా? చెప్పాలన్నారు. కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది… కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే, బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి అన్నారు. మీకు ప్రజలు అంటే లెక్కలేదు, దేవుళ్ళంటే లెక్కలేదు అన్నారు.
Also Read:పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్

