రైతు ఆత్మహత్యల తెలంగాణను.. అన్నపూర్ణ తెలంగాణగా మార్చింది కేసీఆర్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దేశానికే ఆదర్శంగా నిలిచే రైతు సంక్షేమ పథకాలు ప్రారంభించి సాగును బాగు చేసింది కేసీఆర్…జాతీయ నేర గణాంక నివేదిక లెక్కలు కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు అన్నారు.
తెలంగాణలో 2014లో 1347 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, 2023 నాటికి 56కి తగ్గుదల…2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14 వ స్థానికి పరిమితం అయిందన్నారు. 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా అందులో తెలంగాణ వాటా కేవలం 0.51%…10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో 95.84% తగ్గుదల నమోదైందన్నారు.
ఇవి మాటలు కాదు, కేసీఆర్ తిరగరాసిన రికార్డులు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్న వాస్తవాలు…రైతును రాజు చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి, వారు చేసిన నిర్విరామ కృషికి వచ్చిన ఫలితం ఇదంతా..స్వరాష్ట్రంలో ఒక్కో పథకంతో వ్యవసాయరంగానికి జీవం పోశారు. సాగును బాగు చేశారు అన్నారు.
రుణమాఫీతో రైతన్నకు ధీమా దొరికింది.
రైతు బంధు బంధువు అయ్యింది.
రైతు బీమా కొండంత భరోసా ఇచ్చింది.
24 గంటల ఉచిత విద్యుత్తు వెలుగులు నింపింది.
పంట కొనుగోళ్లతో ప్రోత్సాహం అందింది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి గోస తీరింది.
మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగింది.
భూగర్భ జలాలు ఉబికి బీడు భూములను పంట పొలాలుగా మార్చింది.
ఉమ్మడి పాలనలో నిత్య దుర్భిక్షం, సాగు విధ్వంసం, వలసల దురవస్థ, ఆత్మహత్యల దౌర్భాగ్యం..తెలంగాణ!, స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులతో సుజలమై, ధాన్యపురాశులతో సుఫలమై, సాగుభూమి సస్యశ్యామలమై.. కేసీఆర్ పాలనలో విరాజిల్లింది తెలంగాణ!,తెలంగాణను అన్నంగిన్నెగా దేశానికే ఆదర్శంగా నిలిపింది కేసీఆర్!,ఆత్మహత్యల తెలంగాణను, అన్నపూర్ణగా మార్చింది కేసీఆర్!,కెసిఆర్ పాలన గురించి నోరు పారేసుకునే వారికి ఇది చెంపపెట్టు సమాధానం.,కేసీఆర్ కు రైతుకు ఉన్నది పేగు బంధం, ఆత్మ బంధం అయితే.. కాంగ్రెస్ కు ఉన్నది కేవలం ఓటు బంధం ఉందన్నారు.
Also Read:కాళేశ్వరం రిపేర్ పనులకు మోక్షం

