సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా అందించలేని దుస్థితికి ఈ ప్రభుత్వం చేరుకుంది అని…20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని మండిపడ్డారు. .
రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి ఉన్నప్పటికీ పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అని …విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని కోతలు కోసే రేవంత్ రెడ్డీ.. కనీసం విద్యార్థులకు ఒకపూట అన్నం పెట్టే పరిస్థితిలో కూడా లేవా? అని ప్రశ్నించారు. విద్యాశాఖ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన మంత్రి లేడా చెప్పాలన్నారు.
విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విజన్ 2047 గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు.ఢిల్లీ ట్రిప్పులు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, పొలిటికల్ డైవర్షన్లు బందు పెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి. విద్యాశాఖపై సమీక్ష చేయండి. మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయండి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Also Read:ఫాతిమా కాలేజీపై హైడ్రా క్లారిటీ

