కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిద్దాం:హరీశ్‌

1
- Advertisement -

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడిద్దాం అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేట జిల్లా సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మే శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు… సీఎం కు చాయ్ ఇచ్చే వాళ్లు జర గుర్తు జేయుండ్రన్నారు.

సీఎంకి పొద్దుగాల చాయి ఇచ్చేవారు ఆయన హామీలను ఒకసారి గుర్తు చేయండి…అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడు అన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తాం…సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15% విద్యకు బడ్జెట్ పెడతామని 7% బడ్జెట్ కూడా పెట్టలేదు అన్నారు హరీశ్ రావు.

Also Read:2024: టాప్-10 ట్రెండింగ్ టాపిక్స్ ఇవే..!

- Advertisement -