బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళ వర్గాల అభ్యున్నతి కోసం పూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైందన్నారు.
కుల, లింగ వివక్షకు తావు లేకుండా సమానత్వం, విద్య, హక్కుల పరిరక్షణ ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయన్న వారి ఆలోచనే తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలనకు స్పూర్తి అన్నారు.
Also Read:TTD: వైభవంగా కోదండరాముని తెప్పోత్సవాలు
వేల కోట్లతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ వర్గాల అభ్యున్నతి కోసం కెసిఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి విజయవంతంగా అమలు చేశారు… మహాత్మ జ్యోతి రావు పూలే విదేశీ విద్యా పథకం ప్రారంభించి బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అత్యున్నత విదేశీ విద్యను అందించారు అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డకు పెళ్ళికి సాయం చేశారు. బాల్యవివాహాలు కట్టడి చేసి, సామాజిక మార్పుకు నాంది పలికారు… పూలే జయంతి సందర్బంగా ఆ మహనీయుడి సేవలు స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు అందరం పునరంకితం అవుదాం అన్నారు హరీష్.

