మీ సేవా దరఖాస్తుల పేరిట మరోసారి కాంగ్రెస్ దగా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి? చెప్పాలన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు.. కుల గణనలో వివరాలు తీసుకున్నరు. గ్రామ సభల పేరిట డ్రామా చేశారు.ఇప్పుడు మల్లా మీసేవలో దరఖాస్తులు అంటున్నరు అని దుయ్యబట్టారు.
పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీ నేనా?, ప్రజా పాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా? చెప్పాలన్నారు. బిఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగింది… కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారు.జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు అన్నారు.
పేదలకు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే మీ ప్రభుత్వ దృష్టి ఉందని..దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, 14 నెలల పాలనలో మీరు చేసిందేముంది చెప్పాలన్నారు. దరఖాస్తుల పేరిట కాలం వెళ్లదీయడం మానేసి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయండి… ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి, నిరుపేదలకు, రైతులకు బాసటగా నిలవాలన్నారు.
Also Read:తప్పుడు ప్రచారాన్ని ఖండించిన నిఖిల్

