463 టీఎంసీలు నీళ్లు గోదావరి నుండి కృష్ణకి ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది.. మేము ఆల్మట్టిలో 112 టీఎంసీలు ఆపుకుంటామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మీడియాతో మాట్లాడిన హరీశ్.. మీరు అనుమతిస్తే మేము కృష్ణా నది నీళ్లు ఆపుకుంటానని చెప్తున్నాడు.. దీని వల్ల తెలంగాణ నష్టపోతుంది అన్నారు.
కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే.. పైన కృష్ణ నీళ్లు కర్ణాటక తీసుకుపోతే, మన బ్రతుకు ఏం కావాలి.. బనకచర్ల ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ అప్రైజల్ ప్రొసెస్ కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాశాడు అన్నారు.
20 రోజుల కింద సీఆర్ పాటిల్ ఈ లేఖ రాసినా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు.. మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు, రాజ్యాంగం పరంగా వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్ జరగదు అన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ వరద జలాల మీద బనకచర్ల డీపీఆర్ అప్రైజల్ సబ్మిట్ చేసింది.. దీనిపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ రాశారు అన్నారు.
మరి రేవంత్ రెడ్డి వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్ సాధ్యం కాదని నిలదీయాలి.. కానీ దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు అన్నారు.
Also Read:YSRCP:మాజీ మంత్రి నానిపై కేసు

