రెండేళ్లలో జర్నలిస్టులకు చేసింది ఏంది?

5
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు . రెండేళ్లుగా అధికారంలో ఉన్నా జర్నలిస్టుల కోసం ఏమి చేశావు? ఒక్క అక్రిడిటేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. జర్నలిస్టుల సంక్షేమానికి కనీసం ఒక్క రూపాయి అయినా కేటాయించావా? అని ప్రశ్నించారు.

అలాగే విద్యాశాఖ పనితీరును ఎద్దేవా చేస్తూ, “ITI, IIT, IIIT మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉండటం దురదృష్టం” అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అభివృద్ధి దిశ కూడా తప్పుతున్నదని ఆరోపిస్తూ,“కేసీఆర్ తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దితే, రేవంత్ రెడ్డి దాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చుతున్నాడు. కేసీఆర్ ప్రతి ఊరికి పల్లె దవాఖానాలు, పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించగా, రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి ఊరికి బార్, పబ్‌లు పెట్టమని చెప్పే స్థితికి వచ్చాడు” అని ఘాటుగా విమర్శలు గుప్పించారు.

Also Read:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

- Advertisement -