మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు పక్కనే ఉన్న రామప్ప డ్యాం గేట్లు మూసేశారు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్..రామప్పలో నీళ్ళు ఉన్నా గేట్లు మూసేయడంతో, డ్యాం కింద పొలాలు ఎండిపోయాయి… రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న జ్ఞానం మంత్రులకు ఉండాలి కదా అని ప్రశ్నించారు.
దేవాదుల, సమ్మక్క బ్యారేజీ నుంచి జూన్ 1 నుండి ఇవాళ్టి వరకు 105 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ వైపు వదిలారు కానీ ఈ 51 రోజుల్లో నువ్వు ఎత్తింది మాత్రం 1.9 టీఎంసీల నీళ్లు.. 12 టీఎంసీల నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా కూడా ఎత్తలేదు అన్నారు. 12 టీఎంసీల నీళ్లు ఎత్తే అవకాశం ఉంటే 2 టీఎంసీలు కూడా ఎత్తలేదు.. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా రేవంత్ రెడ్డి? ..నీ భాషలో చెప్పాలంటే నిన్ను ఇప్పుడు ఉరి తీయాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవాదులలో నీళ్లు ఉండి కూడా మోటార్లు ఆన్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉరి శిక్ష వేసినా తప్పు లేదు..బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ జిల్లాలో 3,17,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడానికి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసింది… మోటార్లు ఆన్ చేస్తే వరంగల్ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందుతాయి.. కానీ రేవంత్ ప్రభుత్వం మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదు.. పోయిన సంవత్సరం కూడా రూ.8 కోట్లు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ఆన్ అయ్యాయి.. దాంతో రూ.800 కోట్ల పంట ఎండిపోయింది అన్నారు.
Also Read:ఢిల్లీ నిరసనలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆరు నెలల నుంచి ఎల్ నినో ప్రభావం ఉంటుందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోయింది.. రేపే దేవాదుల మోటార్లు స్టార్ట్ చేస్తామని 8 రోజుల కింద కాంగ్రెస్ మంత్రులు చెప్పారు.. ఇప్పటికీ 10 మోటార్లు స్టార్ట్ కాలేదు.. మంత్రులు పోయిన నాడు 7 మోటార్లు నడిస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత 5 మోటార్లే నడిచాయి అన్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 మోటార్లు ఆన్ చేసి 22 రిజర్వాయర్లు నింపి, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతామని చెప్పారు ..వీళ్ళ మాటలు నమ్మి రైతులు నారు మళ్లు పోసుకున్నారు.. ఇప్పుడు ఏమో నీళ్లు ఇవ్వడం లేదు అని దుయ్యబట్టారు.

