పార్టీ ఫిరాయింపు..హైకోర్టు తీర్పు చెంపపెట్టు:హరీశ్‌ రావు

12
- Advertisement -

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు.

ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు అన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యం…తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా ఉందన్నారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యం అన్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ గెలుపు తథ్యం…హైకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభాపతి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాం అన్నారు.

Also Read:Bigg Boss Telugu 8: బేబక్క ఎలిమినేట్

- Advertisement -