Harishrao: విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా?

2
- Advertisement -

గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన మరువకముందే నేడు మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన జరగటం దారుణం అన్నారు.

12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన బాధ కలిగిస్తుందన్నారు. పదేపదే ఇలాంటి ఘటన జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం శోచనీయం అని…అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా?,
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదా? అని ప్రశ్నించారు.

చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్తే ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితి రావడం అత్యంత హేయం అన్నారు. కారణాలు చెబుతూ తప్పించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. విద్యార్థుల ప్రాణాల పట్ల కార్యాచరణ ప్రకటించాలని…గురుకులాల్లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:25 నుండి పార్లమెంట్ సమావేశాలు..

- Advertisement -