ఈ కార్ రేసుపై చర్చ జరగాలి: హరీశ్‌ రావు

2
- Advertisement -

రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్ ని అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్… తొలి అడుగులోనే నైతిక విజయం సాధించారు. వారికి అభినందనలు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులతో ఇది డొల్ల కేసును తేటతెల్లమైంది…అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారు. గోబెల్స్ ప్రచారం చేశారన్నారు.

ఈ కారు రేసింగ్ మీద సభలో చర్చ జరపాలని అడిగాం. వాస్తవాలు ప్రపంచానికి చెబుదాం, ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని అడిగినం…స్పీకర్ ని మొన్నే కలిసి అడిగాం. ఈరోజు సభలో అడిగాం అన్నారు. మిమ్మల్ని బయటకు పంపి సభలో చర్చ కొనసాగించారు,కేసు పెట్టవద్దు అని మేం అడగటం లేదు, చర్చ పెట్టండి అని అడిగాం అన్నారు.

ఎందుకు ఒప్పుకోలేదు. ప్రజలకు వాస్తవాలు తెలియవద్దా,ఫార్ములా ఇ రేసులో 600 కోట్ల అవినీతి అంటూ సీఎం అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసిండు… మిగతా 50శాతం చెల్లించకపోవడం వల్ల రద్దు చేసుకుంటున్నాం, అందుకు అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నం అని సదరు సంస్థ చెప్పిందన్నారు. 45లక్షల పాండ్స్ అంటే సుమారు 47 కోట్లు. కాని రేవంత్ రెడ్డి గారు 600 కోట్ల నష్టం అంటున్నారు. మేం సభలో లేకుంటే శుద్ధ తప్పులు చెప్పిండు…వాస్తవానికి 700 కోట్ల లాభం రాష్ట్రానికి జరిగిందన్నారు.

రేవంత్ తుగ్లక్ పనుల వల్ల, పిచ్చి పని వల్ల 700 కోట్ల నష్టం రాష్ట్రానికి జరిగింది…ఫార్ములా ఇ రేస్ నిర్వహణ వల్ల ఆరేడు వందల కోట్లు హైదరాబాద్ కు మేలు జరిగింది అని 2022లో నీల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ చెప్పింది,రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్దం. రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బ తీసిండు రేవంత్ రెడ్డి అన్నారు.అసలు కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారు.. అవినీతి జరగలేదు, మరి ఏసీబీ కేసులు ఎందుకు పెట్టింది,రాష్ట్ర ఖజానా నుంచి, నేషనల్ బ్యాంకు నుంచి ఆ సంస్థకు డబ్బులు పంపారు అన్నారు. ఇందులో అవినీతి ఏముంది. ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినయి కావొచ్చు, అవినీతి లేదు,పొన్నం ప్రభాకర్ నిన్న అవినీతి జరగలేదు, ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది అన్నడు… వస్తు రూపేనా, ధన రూపేనా అవినీతి జరిగితే ఏసీబీ పని చేస్తదన్నారు. 42 కోట్లతో తమిళనాడులో ఫార్ములా 4 నిర్వహించింది, ఉత్తర్ ప్రదేశ్ 1700 కోట్లతో ఫార్ములా వన్ నిర్వహించింది. 103 కోట్లతో చంద్రబాబు 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించారు, మీ కాంగ్రెస్ ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ 70వేల కోట్లతో నిర్వహించారు. అదొక స్కాం అని మండిపడ్డారు.

Also Read:జిమ్ చేస్తున్నారా..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఎవరైతే తమ ఫెయిల్యూర్స్ కి వేరే వారిని బదనాం చేస్తరో వారు ఎప్పటికీ ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేరు. సమస్యల నుంచి బయట పడలేక ఒక సమస్య నుంచి మరొక సమస్య సృష్టిస్తుంటరు. అట్లా కాలం వెళ్లదీస్తుంటారు..ఈ సామెత ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు అతికినట్లు సరిపోతుందన్నారు.

- Advertisement -