Harish:ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు

10
- Advertisement -

సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌..కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాగి పడింది? ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నాం అన్నారు.

వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారు. ..రేపు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపిణీ చేయాలి,గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు అందరు కలిసి ప్రతి ఇంటికి పోయి ఈ బాకీ కార్డుని అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడిందో వివరించాలి అన్నారు.

కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ పాలనను ఎండగట్టాలి. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి..రైతుబంధు ఇప్పుడైతే 10000 మేము వస్తే 15000 ఇస్తామన్నారు..పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో మూడెకరాల వారికి ఇచ్చిండు మిగతా వాళ్లందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని 12,000 ఇచ్చిండు. మిగతా మూడు వేలు ఎగ్గొట్టిండు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75 వేల రూపాయలు రైతుబంధు బాకీ పడింది. రైతుబంధు రైతుకి ఇస్తాం. కౌలు రైతుకి ఇస్తామన్నారు. ఒక రూపాయి అయినా కౌలు రైతుకు ఇచ్చారా? చెప్పాలన్నారు.

కరోనా వచ్చినా కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు గాని రైతులకు రైతుబంధు ఆపలేదు…పెద్ద పెద్ద రైతులకు మాత్రమే కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నారు అని అన్నీ అబద్దాలే అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు..రాష్ట్రంలో సీలింగ్ ఉంది. 54 ఎకరాల కంటే ఎవరికీ ఎక్కువ భూమి ఉండదు. 25 ఎకరాల మీద ఎంతమందికి తెలంగాణలో భూమి ఉంది అని లెక్క తీస్తే మూడు శాతం మాత్రమే ఉన్నారు అన్నారు.

97 శాతం మంది రైతులు 10 ఎకరాల లోపే ఉన్నారు..కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ చేసింది కరెక్ట్ అని రేవంత్ రెడ్డికి అర్థమైంది,200 ఉన్న పెన్షన్ ని కేసీఆర్ 2000 చేసిండు. పదంతులు పెన్షన్ పెంచిండు కేసీఆర్…కాంగ్రెస్ 4000 పెన్షన్ ఇస్తా అన్నది ఈరోజు వరకు లేదు..అత్తకు, కోడలు ఇద్దరికీ ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డివి అన్నీ గజినీకాంత్ మాటలు.. ఇంటికొక మహిళకు రేవంత్ రెడ్డి 44వేల రూపాయలు బాకీ పడిండు.. 44000 ఇచ్చినంకనే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఓటు అడగాలి అన్నారు.

అంతా మోసం. గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికి పంచిన్రు… ఒక దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, మరోదిక్కు భట్టి విక్రమార్క సంతకం పెట్టి గ్యారంటీ పేపర్లు పంచిర్రు. 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. మొదటి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్నారు 30 క్యాబినెట్ లైనా ఊసే లేదు. ఇచ్చిన హామీల అమలు గురించి ఎవరైనా అడుగుతారేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం చూడట్లేదు.రేవంత్ రెడ్డిని ఎవడు నమ్మిటట్టు లేడని రాహుల్ గాంధీ వచ్చి మాటిచ్చాడు. 4,000 పెన్షన్ ఇప్పిచ్చే గ్యారెంటీ నాది అన్నాడు రాహుల్ గాంధీ. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామన్నావు ఏమైంది. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసాం. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి కింద ₹2,500 ఇస్తామన్నారు. మాట్లాడితే మహిళలను కోటీశ్వరులని చేస్తామంటారు. ఎవరైనా అయ్యారా?,ఈ బాకీ కార్డు లోకల్ బాడీ ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం. ..ఇది కాంగ్రెస్ పాలిట ఉరితాడు అవుతుంది అన్నారు.

Also Read:ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు డాక్టరేట్

- Advertisement -