Harishrao: విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు

7
- Advertisement -

విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపాలన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్ గా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని…వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలన్నారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకువెళ్ళారు అన్నారు.

ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డరు. రైతులు దారుణంగా మోసపోయారు అన్నారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు….ఏం సాధించారని సంబురాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.

ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు ఏడాది అయినా అతీగతీ లేదు…డిక్లరేషన్ లో చెప్పిన మొట్ట మొదటి హామీ 2లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదు అన్నారు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా దిక్కులేదు….ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తాన్న 12వేలు ఇవ్వనేలేదు అన్నారు. పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేశారు…ఆనాడు మీరు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు అన్నారు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి?,మీ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లిందని ప్రశ్నించారు.

కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టింది..అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి.వద్దురో నాయనా కాంగ్రెస్ పాలన అంటూ పాటలు పాడుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు,స్కాలర్ షిప్పుల కోసం విద్యార్థులు,ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ,రుణమాఫీ, రైతు బంధు కోసం రైతన్నలు,జీతాల కోసం ఆశాలు, అంగన్ వాడీలు,డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు
నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది ఆందోళన పడుతున్నారన్నారు.

Also Read:‘దేవకి నందన వాసుదేవ’..నా అదృష్టం: మానస వారణాసి

ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు,ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు,సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసులు చెప్పారు. పింఛన్లు పెంచాలంటూ వృద్ధులు బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్ ఫుల్ గా రోడ్ల మీదకు తెచ్చినవు…కేసీఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే, పది నెలల పాలనలో నువ్వు అందరి కడుపు కొట్టినవు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచినవు అన్నారు.

- Advertisement -