తెలంగాణ గడ్డపై నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి, దశాబ్దాల స్వరాష్ట్ర కాంక్షను నిజం చేసిన ధిక్కార వేదిక భారత రాష్ట్ర సమితి (BRS). నేడు పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకుని, 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు పండుగ వాతావరణంలో మునిగిపోయాయి అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
సమైక్య రాష్ట్రంలో సంకెళ్లను తెంచి, ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ నేతృత్వంలో సాగిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే అరుదైనది…స్వరాష్ట్ర కాంక్ష: తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శక్తిగా బీఆర్ఎస్ ఎదిగింది అన్నారు.
పదేళ్ల ఉజ్వల పాలన: పదేళ్ల అధికారంలో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దడంలో ఈ పార్టీ పోషించిన పాత్ర మరువలేనిది. రైతుబంధు నుంచి కాళేశ్వరం వరకు, మిషన్ భగీరథ నుంచి ఐటీ విప్లవం వరకు ప్రతి అడుగులోనూ అభివృద్ధి పతాకాన్ని ఎగురవేసింది అన్నారు.
రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణలపై బీఆర్ఎస్ శ్రేణులు గళమెత్తుతున్నాయి. “సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలం ఇది” అని పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.ప్రస్తుత పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్నాయని, మళ్లీ ప్రగతి పుంజుకోవాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ఈ క్రమంలోనే “రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి” అనే నినాదం ఇప్పుడు క్షేత్రస్థాయిలో మార్మోగుతోంది.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతుందని పార్టీ నేతలు పునరుద్ఘాటిస్తున్నారు. ఈ పార్టీ కేవలం అధికారం కోసం పుట్టింది కాదు, ఒక జాతి విముక్తి కోసం పుట్టింది.ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మళ్లీ పుంజుకుంటుందని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదని, గులాబీ జెండా సగర్వంగా ఎగిరే సమయం ఆసన్నమైందని పార్టీ శ్రేణులు ప్రతినబూనుతున్నాయి.
Also Read:వాలా Ⅱ..హౌస్‌ఫుల్ రన్!

