రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు చంద్రబాబుని కలిసిన తర్వాతే బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2024 జూలై 6వ తేదీన తెలంగాణ ప్రగతి భవన్‌లో రేవంత్ రెడ్డి, చంద్రబాబుని కలిసి తెలంగాణ నీటి హక్కులకు మరణశాసనం రాసిండు అన్నారు.
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్…2024 సెప్టెంబర్ 13వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా విజయవాడ వెళ్లి, చంద్రబాబుని కలిసి బజ్జీలు తిని వచ్చాడు అన్నారు. నవంబర్‌లో బనకచర్ల గురించి చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్‌కి లేఖ రాశాడు అన్నారు. నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపుడు నీ అధ్యక్షతన ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సచ్చిన పాము అయిందా? చెప్పాలన్నారు.
ఈ చచ్చిన పాము లాంటి చౌక బారు ముచ్చట్లు మాకు చెప్పకు రాహుల్ గాంధీకి చెప్పుకో … నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచింది అన్నారు. అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అధఃపాతాళానికి తొక్కుతారు అన్నారు. రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హైదరాబాద్‌లో ఇచ్చినట్లు లేదు అమరావతిలో ఇచ్చినట్లు ఉంది అన్నారు.
నిన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అమరావతిలో చంద్రబాబు తయారు చేసినట్టు ఉంది… చంద్రబాబు అడ్డుకున్న తెలంగాణ ప్రాజెక్టుల గురించి నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఎందుకు చూపించలేదు? చెప్పాలన్నారు.మీరు బనకచర్లను అడ్డుకున్నది నిజమైతే మీరు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు చూపించాలి కానీ, గతంలో కేసీఆర్ రాసిన లేఖలు చూపించడం ఏంటి చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డికి బనకచర్ల కట్టే చంద్రబాబు బంగారు బాబు లెక్క కనిపిస్తున్నాడు, అడ్డుకున్న బీఆర్ఎస్ సచ్చిన పాము లెక్క కనిపిస్తుంది…బీఆర్ఎస్ సచ్చిన పాము అయితే కలలో కూడా ఎందుకు బీఆర్ఎస్, కేసీఆర్ జపం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read:మేడారం మహాజాతర..తేదీలివే

