30-40 ఏళ్ల నాటి ఎన్నికల నినాదం, సిద్దిపేటను జిల్లా చేయాలనే గోడ రాతల కలను కేసీఆర్ నిజం చేసి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. 1983లో ఎన్టీఆర్‌కు అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం ఇచ్చిన కేసీఆర్ గారు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అదే చేత్తో సంతకం చేసి జిల్లాను ఇచ్చారు. సిద్దిపేట జిల్లా, రైలు మార్గం, గోదావరి జలాలు అనే మూడు దశాబ్దాల చిరకాల ఆకాంక్షలు ప్రజల కళ్ల ముందే నిజమయ్యాయి అన్నారు.
ఇప్పటికే విద్యా నిలయంగా మారిన సిద్దిపేటకు రాబోయే రోజుల్లో యూనివర్సిటీని తీసుకురావడమే మన తదుపరి ప్రధాన లక్ష్యం.సిద్దిపేట జిల్లాగా ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన 10K రన్ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఉదయాన్నే ఆహ్లాదకరమైన వాతావరణంలో వేలాది మంది యువతీ యువకులు, క్రీడాకారులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం హరీశ్ రావు గారు 10k రన్‌లో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా అనేది ఒక దశాబ్దాల కల…ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దిపేట జిల్లా చేస్తామని 30 ఏళ్లు, 40 ఏళ్లు గోడల మీద రాతలు, ఎన్నికల నినాదాలు, కరపత్రాలు చూశాం.కానీ ఆ కలను నిజం చేసుకున్న రోజు 2016 అక్టోబర్ 11. 2016 అక్టోబర్ 11కు పదేళ్లు నిండుతున్నాయి.. అంటే మన సిద్దిపేట జిల్లాకు 10 ఏళ్లు నిండుతున్నాయి. ఈ పదేళ్లు నిండుతున్న పండుగలో మీరందరూ ఈ 10K రన్‌లో పాల్గొనడానికి రావడం చాలా సంతోషం. ఇంత పొద్దున్నే ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్సాహభరితంగా ఈ 10K రన్‌లో మీరందరూ పాల్గొంటున్నారు. ఈ రన్ ఎంత వేగంగా జరుగుతుందో.. మన సిద్దిపేట జిల్లా కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. ఉదయాన్నే సూర్యుడు చీకటిని చీల్చుకుని ఎలా వస్తాడో.. ఈ దశాబ్దాల కాలం పాటు కలగా ఉన్న సిద్దిపేట జిల్లా కూడా ఆ సూర్యుడు చీకటిని చీల్చుకుని వచ్చినట్టుగా ఆవిర్భవించింది. ఈ జిల్లా అభివృద్ధిలో అద్భుతంగా ప్రయాణించింది. మీ అందరికీ తెలుసు.. ఇన్ని స్పోర్ట్స్ క్లబ్స్ వచ్చాయంటే, ఇంత గొప్ప క్రీడా మైదానాలు ఇక్కడ ఏర్పడ్డాయంటే, ఇన్ని జిల్లా కార్యాలయాలు ఇక్కడ వచ్చాయంటే, సిద్దిపేట ఇంత వేగంగా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం జిల్లా ఏర్పడడం వల్లే సాధ్యమైంది. ఇక్కడ మా పీఈటీ టీచర్లు కనబడుతున్నారు, మా స్పోర్ట్స్ క్లబ్స్ వాళ్లు కనబడుతున్నారు. ఆ రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీలు ఉంటే పొద్దున్నే 5 గంటలకు బస్సెక్కి సంగారెడ్డి పోయి ఎన్ని రకాల బాధలు పడ్డారో నాకంటే ఎక్కువ అనుభవించిన వాళ్లకే బాగా తెలుసు అన్నారు.
Also Read:బీజేపీది ఆర్థిక ఉగ్రవాదమే:ఖర్గే

